📄 ePaper
Wednesday, August 12, 2026
📄 ePaper
HomeతెలంగాణKamareddyగుర్జకుంటలో బజార్ లైన్‌కు ఆటోమేటిక్ టైమర్ ఏర్పాటు

గుర్జకుంటలో బజార్ లైన్‌కు ఆటోమేటిక్ టైమర్ ఏర్పాటు

గ్రామమంతా ఒకే సమయానికి వెలిగేలా వీధి దీపాల నిర్వహణ..

బిక్కనూరు, జూలై 12 (నవజ్యోతి ప్రతినిధి):

బిక్కనూరు మండలంలోని గుర్జకుంట గ్రామంలో గొల్ల సిద్దయ్య ఇంటి సమీపంలోని బజార్ లైన్‌కు ఆటోమేటిక్ టైమర్ ఏర్పాటు చేశారు. గ్రామంలోని అన్ని వీధి దీపాలు ఒకే సమయానికి వెలిగేలా ఈ వ్యవస్థను అమలు చేశారు.

టైమర్ ప్రకారం ప్రతిరోజూ సాయంత్రం 6:45 గంటలకు వీధి దీపాలు ఆటోమేటిక్‌గా ఆన్ అవుతాయి. మరుసటి రోజు ఉదయం 5:40 గంటలకు ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతాయి. ఈ విధానం ద్వారా వీధి దీపాల నిర్వహణ సులభతరం కావడంతో పాటు విద్యుత్ వినియోగం కూడా క్రమబద్ధీకరించబడుతుందని గ్రామ సర్పంచ్ సంతోష్ రెడ్డి తెలిపారు. గ్రామ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ఇలాంటి చర్యలు కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!