📄 ePaper
Saturday, August 15, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్స్వాతంత్య్ర వేడుకలకు జిల్లాలకు ఇన్‌చార్జ్‌లు !

స్వాతంత్య్ర వేడుకలకు జిల్లాలకు ఇన్‌చార్జ్‌లు !

30 జిల్లాలకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సలహాదారుల నియామకం

హైదరాబాద్‌, ఆగస్టు 13 (నవజ్యోతి ప్రతినిధి):
80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రంలోని 30 జిల్లాల్లో జాతీయ జెండా
ఆవిష్కరించే మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సలహాదారులను తెలంగాణ ప్రభుత్వం
నియమించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆగస్టు 15న ఉదయం 9.30 గంటలకు జిల్లా కేంద్రాల్లో జెండా ఆవిష్కరణతో
పాటు గౌరవ వందనం స్వీకరించనున్నారు.

కామారెడ్డికి హనుమంతరావు

కామారెడ్డి జిల్లాకు ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావును ప్రభుత్వం
నియమించింది. ఆదిలాబాద్‌కు మహ్మద్‌ అలీ షబ్బీర్‌, భద్రాద్రి కొత్తగూడెంకు తుమ్మల
నాగేశ్వరరావు, హనుమకొండకు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జగిత్యాలకు మహ్మద్‌
అజారుద్దీన్‌, జయశంకర్‌ భూపాలపల్లికి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జనగామకు బీర్ల
ఐలయ్య, జోగులాంబ గద్వాలకు ఏపీ జితేందర్‌రెడ్డి, కరీంనగర్‌కు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌,
ఖమ్మంకు భట్టి విక్రమార్క, కుమురంభీం ఆసిఫాబాద్‌కు బండా ప్రకాశ్‌లను నియమించారు.

మిగతా జిల్లాలకు బాధ్యతలు

మహబూబాబాద్‌కు జె. రాంచందర్‌ నాయక్‌, మహబూబ్‌నగర్‌కు జూపల్లి కృష్ణారావు,
మంచిర్యాలకు హరకర వేణుగోపాల్‌రావు, మెదక్‌కు వివేక్‌ వెంకటస్వామి, మేడ్చల్‌కు
కె. కేశవరావు, ములుగుకు దనసరి అనసూయ సీతక్క, నాగర్‌కర్నూల్‌కు జి. చిన్నారెడ్డి,
నల్గొండకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నారాయణపేటకు వాకిటి శ్రీహరి, నిర్మల్‌కు
వెముల వీరేశం, నిజామాబాద్‌కు పి. సుధర్శన్‌రెడ్డి, పెద్దపల్లికి చింతకుంట
విజయరమణారావు, రాజన్న సిరిసిల్లకు ఆది శ్రీనివాస్‌, రంగారెడ్డికి దుద్దిళ్ల
శ్రీధర్‌బాబు, సంగారెడ్డికి దామోదర రాజనర్సింహ, సిద్దిపేటకు పొన్నం ప్రభాకర్‌,
సూర్యాపేటకు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వికారాబాద్‌కు గడ్డం ప్రసాద్‌కుమార్‌,
వనపర్తికి పట్నం మహేందర్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది.

హైదరాబాద్‌లో సీఎం జెండా ఆవిష్కరణ

హైదరాబాద్‌లోని గోల్కొండ కోట రాణిమహల్‌ లాన్స్‌లో ఆగస్టు 15న ఉదయం
10 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!