📄 ePaper
Friday, October 2, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిపై బెయిలబుల్ వారెంట్...

ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిపై బెయిలబుల్ వారెంట్…

అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని హైదరాబాద్ సీపీకి హైకోర్టు ఆదేశం..

హైదరాబాద్, ఆగస్టు 7 (నవజ్యోతి ప్రతినిధి):

తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ సుల్తానియాపై హైకోర్టు గురువారం బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కేసు విచారణలో వ్యక్తిగతంగా హాజరుకాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం, ఆయనను అరెస్ట్ చేసి వెంటనే కోర్టులో హాజరుపరచాలని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది.

ఈ కేసులో పలుమార్లు అవకాశాలు ఇచ్చినప్పటికీ కోర్టు ఆదేశాల అమలులో నిర్లక్ష్యం జరిగిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొంటూ తదుపరి చర్యగా బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ వారెంట్‌ను అమలు చేసి సందీప్ సుల్తానియాను న్యాయస్థానం ఎదుట హాజరుపరచాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!