📄 ePaper
Saturday, August 8, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్నకిలీ ఫైర్ ఎన్‌వోసీలపై ఇంటర్ బోర్డు విచారణ..!

నకిలీ ఫైర్ ఎన్‌వోసీలపై ఇంటర్ బోర్డు విచారణ..!

అఫిలియేషన్ కోసం తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించిన కాలేజీలపై కఠిన చర్యలకు సిద్ధం

హైదరాబాద్, ఆగస్టు 7 (నవజ్యోతి ప్రతినిధి): తెలంగాణ ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు అఫిలియేషన్ కోసం నకిలీ ఫైర్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు (Fire NOCs) సమర్పించాయన్న ఆరోపణలపై అంతర్గత విచారణ ప్రారంభించింది. ఈ వ్యవహారంపై వచ్చిన మీడియా కథనాలను బోర్డు తీవ్రంగా పరిగణించినట్లు తెలిపింది.

ఫైర్ ఎన్‌వోసీల ప్రామాణికతను పరిశీలిస్తున్నామని, విచారణలో నిబంధనలు ఉల్లంఘించినట్లు లేదా తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలితే సంబంధిత కళాశాలలపై చట్టపరమైన నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు స్పష్టం చేసింది.

ఈ వ్యవహారంలో సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ విచారణ కొనసాగుతోందని తెలిపింది. చెల్లుబాటు అయ్యే అఫిలియేషన్ లేకుండా విద్యాసంస్థలను నిర్వహించినా, నిబంధనలను ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

తల్లిదండ్రులు, విద్యార్థులు, కళాశాల యాజమాన్యాలు ధృవీకరించని సమాచారం, పుకార్లను నమ్మవద్దని బోర్డు విజ్ఞప్తి చేసింది. అధికారిక సమాచారం కోసం మాత్రమే టీజీబీఐఈ విడుదల చేసే ప్రకటనలు, అధికారిక వెబ్‌సైట్‌ను అనుసరించాలని సూచించింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!