📄 ePaper
Saturday, August 15, 2026
📄 ePaper
Homeసంగారెడ్డిసీఎం సభకు సర్వం సిద్ధం... ఏర్పాట్లను పరిశీలించిన జగ్గారెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి

సీఎం సభకు సర్వం సిద్ధం… ఏర్పాట్లను పరిశీలించిన జగ్గారెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి

సంగారెడ్డి, ఆగస్టు 14 (నవజ్యోతి ప్రతినిధి) : సంగారెడ్డిలో శనివారం జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. శుక్రవారం డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డితో కలిసి సభా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. లక్ష మందితో సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని, సంగారెడ్డి నియోజకవర్గం నుంచే సుమారు 50 వేల మంది హాజరవుతారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. సభ విజయవంతానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామిలతో నిరంతరం సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ఐబీ చౌరస్తాలో మాజీ ప్రధానమంత్రులు జవహర్‌లాల్ నెహ్రూ, రాజీవ్‌గాంధీ విగ్రహాలను సీఎం ఆవిష్కరిస్తారని చెప్పారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుడుతోందన్నారు. వర్షం వచ్చినా ఇబ్బందులు లేకుండా జర్మన్ షెడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో చేర్యాల ఆంజనేయులు, తోపాజీ అనంత్ కిషన్, జార్జ్, కిరణ్ గౌడ్, కూన సంతోష్, షఫీ హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!