📄 ePaper
Monday, August 10, 2026
📄 ePaper
Homeతెలంగాణడిగ్రీ, బీ.టెక్, ఫార్మసీ, అగ్రికల్చర్, పీజీ నాలుగో సెమిస్టర్ ఫలితాలు విడుదల...

డిగ్రీ, బీ.టెక్, ఫార్మసీ, అగ్రికల్చర్, పీజీ నాలుగో సెమిస్టర్ ఫలితాలు విడుదల…

ఉమ్మడి రంగారెడ్డి, జూలై 09, (నవజ్యోతి ప్రతినిధి శివారెడ్డి)  :  హిమాయత్‌నగర్‌లో గల చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ లో ఏప్రిల్ లో నిర్వహించిన డిగ్రీ, బి. టెక్, ఫార్మసీ, అగ్రికల్చర్, పీజీ (ఎం.యస్సి,ఎంబీఏ. ఎంసీఏ, ఎం. ఫార్మసీ, ఎం. టెక్) పరీక్ష నాలుగవ సెమిస్టరు పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను యూనివర్సిటీ వ్యవస్థాపకులు & ఛాన్సలర్ డాక్టర్ సిహెచ్. వి . పురుషోత్తం రెడ్డి అధికారికంగా విడుదల చేశారు.

6 వ సెమిస్టరు విభాగాల వారీగా ఉత్తీర్ణత వివరాలు :

డిగ్రీ 6 వ సెమిస్టరు లో బి . యస్సి అన్ని విభాగంలో , బిబిఏ , బి.కం(సిఏ ) లో 418 మంది విద్యార్థులు పరీక్షలు హాజరు కాగా 349 మంది విద్యార్థులు ఉత్తీర్ణయిలైనారు, 86.49%, బి .టెక్ 6 వ సెమిస్టర్ అన్ని విభాగంలో లో 321 మంది విద్యార్థులు పరీక్షలు హాజరు కాగా 262 మంది విద్యార్థులు ఉత్తీర్ణయిలైనారు, 81.61%, అల్లైడ్ హెల్త్ సైన్స్ 6 వ సెమిస్టరు విభాగలలో (ఆర్ఐటి , సివిటి , ఏఓటి , బిపిటి ) 382 మంది విద్యార్థులు పరీక్షలు హాజరు కాగా 313 మంది విద్యార్థులు ఉత్తీర్ణయిలైనారు, 81.93%, బి.ఫార్మసీ 6 వ సెమిస్టర్ లో 136 మంది విద్యార్థులు పరీక్షలు హాజరు కాగా 92 మంది విద్యార్థులు ఉత్తీర్ణయిలైనారు, 67.64%, బి.యస్సి (అగ్రికల్చర్ ) 6 వ సెమిస్టర్ లో 72 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా మంది 55 విద్యార్థులు ఉత్తీర్ణయిలైనారు, 100%.

4 వ సెమిస్టరు విభాగాల వారీగా ఉత్తీర్ణత వివరాలు :

బి .టెక్ 4 వ సెమిస్టర్ అన్ని విభాగంలో లో 841 మంది విద్యార్థులు పరీక్షలు హాజరు కాగా 706 మంది విద్యార్థులు ఉత్తీర్ణయిలైనారు, 83.94%, అల్లైడ్ హెల్త్ సైన్స్ 4 వ సెమిస్టరు విభాగలలో (ఆర్ఐటి , సివిటి , ఏఓటి , బిపిటి ) 480 మంది విద్యార్థులు పరీక్షలు హాజరు కాగా 300 మంది విద్యార్థులు ఉత్తీర్ణయిలైనారు, 62.5%, బి.ఫార్మసీ 4 వ సెమిస్టర్ లో 126 మంది విద్యార్థులు పరీక్షలు హాజరు కాగా 89 మంది విద్యార్థులు ఉత్తీర్ణయిలైనారు, 70.63%, బి.యస్సి (అగ్రికల్చర్ ) 4 వ సెమిస్టర్ లో 56 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా మంది 37 విద్యార్థులు ఉత్తీర్ణయిలైనారు, 66.17%, బి.యస్సి నర్సింగ్ 4 వ సెమిస్టర్ లో 116 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా మంది 74 విద్యార్థులు ఉత్తీర్ణయిలైనారు, 63.79%, పీజీ ( ఎం. యస్సి , ఎంబీఏ . ఎంసీఏ , ఎం. ఫార్మసీ, ఎం . టెక్ )పరీక్ష నాలుగవ సెమిస్టర్ లో 195 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా మంది 167 విద్యార్థులు ఉత్తీర్ణయిలైనారు, 85.64%,

అలాగే ఫార్మ్.డి (పి బి ) ఫస్ట్ ఇయర్ లో 7 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా మంది 7 విద్యార్థులు ఉత్తీర్ణయిలైనారు, 100%, ఫార్మ్.డి సెకండ్ ఇయర్ లో 34 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా మంది 18 విద్యార్థులు ఉత్తీర్ణయిలైనారు, 52.94%, ఫార్మ్.డి థర్డ్ ఇయర్ లో 42 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా మంది 21 విద్యార్థులు ఉత్తీర్ణయిలైనారు, 50%, బి .టెక్ 8 వ సెమిస్టర్ అన్ని విభాగంలో లో 27 మంది విద్యార్థులు పరీక్షలు హాజరు కాగా 27 మంది విద్యార్థులు ఉత్తీర్ణయిలైనారు, 100%, ఈ సందర్భంగా యూనివర్సిటీ ఛాన్సలర్ డా. పురుషోత్తం రెడ్డి, డైరెక్టర్ & చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్. సాత్విక రెడ్డి విద్యార్థులు సాధించిన విజయాన్ని ప్రశంసిస్తూ వారిని అభినందించారు. అధ్యాపకుల కృషిని కూడా వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య జి . శంకర్ లింగం, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ ఎస్. కవిత, డీన్ అడ్మిషన్స్ డాక్టర్ . సిహెచ్ . ప్రత్యుష రెడ్డి, డీన్ ఫార్మసీ. జి. కుమారస్వామి, డీన్ అల్లైడ్ హెల్త్ సైన్స్ (ఇంచార్జి) ఆచార్య బి. శ్రీలత, డీన్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ డాక్టర్ పి . సుగంధ దేవి, డీన్ అగ్రికల్చర్ డాక్టర్ . డి . దేవ్ కుమార్, ఎగ్జామ్స్ కంట్రోలర్ బి. రాజేందర్ రెడ్డి, డిప్యూటీ కంట్రోలర్స్ వరప్రసాద్, జగదీశ్వర్, సుదీప్తా చాంద్, రఘుపతి, పలు విభాగల అధిపతిలు బి, చంద్రమౌళి,బి .శోభారాణి, కె . స్పందన, పి.యస్ పద్మ ప్రణవి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ & పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గాదె రాంబాబు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!