📄 ePaper
Tuesday, September 29, 2026
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్ఇంటి ముంగిటే చైన్ స్నాచింగ్... క్షణాల్లోనే ప్రజల వలలో దొంగ

ఇంటి ముంగిటే చైన్ స్నాచింగ్… క్షణాల్లోనే ప్రజల వలలో దొంగ

కుత్బుల్లాపూర్, జూలై 27: (నవజ్యోతి ప్రతినిధి)

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్ఏఎల్ రాఘవేంద్ర కాలనీలో చైన్ స్నాచింగ్ ఘటన జరిగింది. ఇంటి ముందు కూర్చున్న వెంకమ్మ (80) మెడలోని సుమారు మూడు తులాల బంగారు గొలుసును బైక్‌పై వచ్చిన దుండగుడు లాక్కెళ్లాడు.

వృద్ధురాలి అరుపులు విన్న స్థానికులు వెంటనే స్పందించి నిందితుడిని వెంబడించి పట్టుకుని దేహశుద్ధి చేశారు. అయితే గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని తన బైక్‌ను అక్కడే వదిలేసి నిందితుడు పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు బైక్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు

.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!