📄 ePaper
Monday, August 10, 2026
📄 ePaper
Homeభక్తి - ఆధ్యాత్మికతబోనమెత్తిన బస్తీలు..భక్తితో నిండిన వీధులు

బోనమెత్తిన బస్తీలు..భక్తితో నిండిన వీధులు

అమ్మవారి నామస్మరణతో మార్మోగిన సాయిబాబా నగర్

బోనాల వేడుకల్లో ప్రజలతో మమేకమైన వారాల వినోద్ కుమార్

కుత్బుల్లాపూర్, ఆగస్టు 9: (నవజ్యోతి ప్రతినిధి)

బోనం తలపై.. అమ్మవారి నామస్మరణ నోట.. డప్పుల మోత మధ్య సాగిన ఘటాల కార్యక్రమాలతో 292వ డివిజన్ సాయిబాబా నగర్ ఆదివారం భక్తిరసంతో తడిసిముద్దయింది. పలు బస్తీలు, కాలనీల్లో నిర్వహించిన బోనాల పూజా కార్యక్రమాలకు మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది.

*అమ్మవారి సన్నిధిలో నాయకులు..భక్తులతో కలిసి అడుగులు*

బోనాల వేడుకల్లో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ భక్తులతో కలిసి పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనం సమర్పించారు. భక్తులతో మమేకమై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. ప్రజలందరి సంక్షేమం కోసం అమ్మవారిని ప్రార్థించారు.

*ప్రతి ఇంటా సుఖసంతోషాలు ఉండాలి*

ఈ సందర్భంగా వారాల వినోద్ కుమార్ మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తుందని అన్నారు.

*పండుగకు ప్రజలే ప్రాణం*

సాయిబాబా నగర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో స్థానికుల ఉత్సాహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళలు బోనాలతో తరలిరాగా, యువత, స్థానికులు వేడుకల్లో భాగస్వాములయ్యారు. డప్పుల మోతలు, అమ్మవారి నామస్మరణలతో కాలనీల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.

ఈ కార్యక్రమాల్లో బీఆర్‌ఎస్ నాయకులు రాజ్‌కుమార్ ముదిరాజ్, తెలుగు తల్లి నగర్ అధ్యక్షుడు తారా సింగ్, మైత్రి నగర్ అధ్యక్షుడు గట్టు అశోక్, జైభీమ్ నగర్ అధ్యక్షుడు భాస్కర్, రాజు యాదవ్, బద్రి, జైసింహ రెడ్డి, మహేష్ గౌడ్, వారాల సాయి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!