📄 ePaper
Wednesday, August 12, 2026
📄 ePaper
Homeసంగారెడ్డిబండంకొమ్ము రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..

బండంకొమ్ము రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..

అమీన్‌పూర్, జూలై 4(నవజ్యోతి ప్రతినిధి):

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీన్ చౌక్–బండంకొమ్ము ప్రాంతంలో శుక్రవారం రాత్రి సుమారు 1 గంట సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు.

అమీన్పో పూర్  పోలీసుల వివరాల ప్రకారం, మృతుడి వయస్సు సుమారు 50 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండవచ్చని తెలిపారు. ప్రస్తుతం మృతదేహాన్ని పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతుడిని గుర్తించేందుకు పోలీసులు ప్రజల సహకారం కోరుతున్నారు.మృతుడు గులాబీ రంగు ఫుల్ షర్ట్, నలుపు రంగు ప్యాంటు,ఎడమ చేతికి తెలుపు రంగు కడియం ఉంది.నలుపు, తెలుపు రంగుల గడ్డం కలిగి ఉన్నాడని తెలిపారు.

మృతుడి వివరాలు తెలిసిన వారు లేదా అతడిని గుర్తించగలిగిన వారు వెంటనే అమీన్‌పూర్ పోలీసులను సంప్రదించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!