📄 ePaper
Wednesday, August 12, 2026
📄 ePaper
Homeమెదక్రామాయంపేట వై జంక్షన్ ప్రమాదాలకు బాధ్యులు ఎవరు?.. మాజీ ఎమ్మెల్యేపై బీజేపీ తీవ్ర ఆరోపణలు.

రామాయంపేట వై జంక్షన్ ప్రమాదాలకు బాధ్యులు ఎవరు?.. మాజీ ఎమ్మెల్యేపై బీజేపీ తీవ్ర ఆరోపణలు.

  • 30 మంది ప్రాణాలు బలిగొన్న వై జంక్షన్.. బాధ్యత బీఆర్ఎస్ పాలకులదే :బీజేపీ
  • పదేళ్ల నిర్లక్ష్యంతో ప్రాణనష్టం.. ఇప్పుడు క్రెడిట్ రాజకీయాలు ఎందుకు?? 
  • జంక్షన్ విషాదాలకు నైతిక బాధ్యత మాజీ ఎమ్మెల్యేదే: బీజేపీ ఆరోపణ
  •  రూ.47.21 కోట్ల నిధులు కేంద్రం మంజూరు చేసింది – ఎంపీ రఘునందన్ రావు కృషి ఫలితమే : బీజేపీ నాయకులు 
రామాయంపేట, జులై 17 ( నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్ ) : 

రామాయంపేట పట్టణంలోని జాతీయ రహదారిపై ఉన్న వై జంక్షన్‌లో గత కొన్నేళ్లుగా చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలకు బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, అప్పటి ప్రజాప్రతినిధుల వైఫల్యమే కారణమని బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు, పంజా విజయ్ కుమార్ ఆరోపించారు. శుక్రవారం రామాయంపేట లో ఫ్లై ఓవర్‌కు కేంద్రం నిధులు మంజూరు చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.వై జంక్షన్ ప్రమాదకర ప్రాంతంగా మారి వరుస ప్రమాదాల్లో సుమారు 30 మంది ప్రాణాలు కోల్పోయినా, అప్పటి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోలేదని వారు విమర్శించారు. ప్రజల నుంచి ఎన్నో వినతులు, నిరసనలు వచ్చినప్పటికీ ఫ్లైఓవర్ నిర్మాణంపై చొరవ చూపలేదని ఆరోపించారు.

గతంలో వై జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదాల నివారణ కోసం సంబంధిత అధికారులు చేపట్టిన భద్రతా చర్యలను కూడా రాజకీయ కారణాలతో అడ్డుకున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. అప్పటి బీఆర్ఎస్ నాయకత్వం వల్లే ఫ్లైఓవర్ ప్రతిపాదన ఆలస్యమైందని, ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశాన్ని రాజకీయాలకు బలిచేశారని వ్యాఖ్యానించారు.వై జంక్షన్ వద్ద గతంలో చేపట్టిన వంతెన నిర్మాణ పనులను కూడా నిలిపివేయించారని, ప్రాజెక్టు రద్దుకు కారణమయ్యారని మాజీ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేశారు. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నైతిక బాధ్యత వహిస్తూ మాజీ ఎమ్మెల్యే స్పందించాలని, బాధిత కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించేందుకు ముందుకు రావాలని డిమాండ్ చేశారు.రామాయంపేట అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంటూ, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సహకారంతో మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్లే వై జంక్షన్‌లో రూ.47,21,39,929 వ్యయంతో ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. మరో రెండు నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు.ఈ నిధుల మంజూరులో ఎలాంటి పాత్ర లేకపోయినా, ఫ్లైఓవర్ ఘనతను తమదిగా చెప్పుకునే ప్రయత్నం చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని బీజేపీ నాయకులు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం, ఎంపీ రఘునందన్ రావు కృషితోనే ఈ ప్రాజెక్టు సాధ్యమైందని స్పష్టం చేశారు.

అనంతరం రామాయంపేట మెదక్ చౌరస్తాలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు చిత్రపటాలకు బీజేపీ నాయకులు పాలాభిషేకం నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. ఫ్లైఓవర్ నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యలు తగ్గి రోడ్డు ప్రమాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు, పంజా విజయ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్ గౌడ్, అక్కన్నపేట సర్పంచ్ బక్కన్న గారి యాదగిరి,

దంతేపల్లి సర్పంచ్ మస్కూరి బాలరాజు, పబ్బ సత్యం, గోపిశెట్టి రమణ, చిన్నమైన శ్రీనివాస్, చింతల శేఖర్, పట్టణ అధ్యక్షుడు అవినాష్ రెడ్డి,వడ్ల శ్యాములు చారి, దిలీప్ కుమార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

 

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!