📄 ePaper
Wednesday, August 12, 2026
📄 ePaper
Homeసంగారెడ్డిసంగారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో నేటి నుంచి టైప్‌రైటింగ్ పరీక్షలు

సంగారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో నేటి నుంచి టైప్‌రైటింగ్ పరీక్షలు

సంగారెడ్డి, జూలై 16 (నవజ్యోతి ప్రతినిధి):

తెలంగాణ స్టేట్ టెక్నికల్ టైప్‌రైటింగ్ అండ్ షార్ట్‌హ్యాండ్ ఇన్‌స్టిట్యూట్స్ అసోసియేషన్ (టీటీఎస్‌సీఐఏ) ఆధ్వర్యంలో టైప్‌రైటింగ్ పరీక్షలు ఈ నెల 17, 18 తేదీల్లో సంగారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించనున్నట్లు సంస్థ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బి. కృష్ణమూర్తి తెలిపారు. ఇస్మాయిల్‌ఖాన్‌పేట్ సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ప్రతిరోజూ నాలుగు బ్యాచ్‌లలో అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్‌టికెట్, అవసరమైన గుర్తింపు పత్రాలతో పాటు కేటాయించిన సమయానికి కనీసం అరగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పరీక్షల నిర్వహణకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్న ఆయన, అభ్యర్థులు నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసి విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!