📄 ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeసంగారెడ్డిజర్నలిస్టు సంఘం నేత యాదగిరిని సన్మానించిన హరీష్ రావు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

జర్నలిస్టు సంఘం నేత యాదగిరిని సన్మానించిన హరీష్ రావు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

అభినందించిన పలువురు నేతలు

సంగారెడ్డి, జూలై 14 (నవజ్యోతి ప్రతినిధి)

తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు టియుడబ్ల్యూజే ఐజేయు సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన బండారు యాదగిరి బి ఆర్ ఎస్ శాసనసభాపక్ష ఉప నేత హరీష్ రావు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సోమవారం సాయంత్రం శాలువాతో సత్కరించారు. సంగారెడ్డి లోని చింత ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం సాయంత్రం హరీష్ రావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టియుడబ్ల్యూజే ఐజేయు నూతన కార్యవర్గ ఎన్నిక గురించి జిల్లా మహాసభ గురించి న సమాచారం కొందరు నాయకులు హరీష్ రావుకు తెలిపారు. దీంతో వెంటనే అక్కడనే ఉన్న జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి కి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. శాలువా కప్పి అభినందించారు. రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు భుజం తట్టారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కూడా శాలువాకప్పి బండారు యాదగిరిని సన్మానించారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ శివకుమార్, టీఎన్జీవో రాష్ట్ర మాజీ నేత రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, బిఆర్ఎస్ నేతలు కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్రెడ్డి, చింత సాయినాథ్, గోవర్ధన్ నాయక్ , జీవి శ్రీనివాస్షేక్ సాబేర్ ,శ్రీధర్ రెడ్డి, మల్ల గౌడ్, తదితరులు టి యు డబ్ల్యూ జే ఐ జేయు అధ్యక్షుడు బండారు యాదగిరికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!