📄 ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeసంగారెడ్డిసంగారెడ్డి జిల్లా దళిత జర్నలిస్టు ఫోరం అధ్యక్షునిగా రామని అశోక్

సంగారెడ్డి జిల్లా దళిత జర్నలిస్టు ఫోరం అధ్యక్షునిగా రామని అశోక్

సంగారెడ్డి జిల్లా దళిత జర్నలిస్టు ఫోరం అధ్యక్షునిగా రామని అశోక్

 

సంగారెడ్డి: దళిత జర్నలిస్టు ఫోరం (డీజేఎఫ్) సంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా సీనియర్ జర్నలిస్టు రామని అశోక్ నియమితులయ్యారు. ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు కాశపాగు జాన్ ఆదేశాల మేరకు ఈ నియామకాన్ని చేపట్టినట్లు రాష్ట్ర అధ్యక్షుడు తలారి యాదగిరి, ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు రాపాక విజయ్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రామని అశోక్‌పై ఉన్న విశ్వాసంతో జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. జిల్లాలో మండల, పట్టణ, నియోజకవర్గ స్థాయి కమిటీలను త్వరితగతిన పూర్తి చేసి సంస్థను బలోపేతం చేయాలని సూచించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మహాసభల నిర్వహణకు సహకరించాలని కోరారు. నూతన జిల్లా అధ్యక్షుడు రామని అశోక్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు కాశపాగు జాన్, రాష్ట్ర అధ్యక్షుడు తలారి యాదగిరి, ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు రాపాక విజయ్ రాజుకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని దళిత జర్నలిస్టులు, ఇతర పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి ముందుండి పనిచేస్తానని చెప్పారు. జర్నలిస్టుల సమస్యలను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రతి జర్నలిస్టుకు న్యాయం జరిగేలా సంస్థ తరఫున నిరంతరం పోరాడుతానని స్పష్టం చేశారు. ఈ నియామకంపై జిల్లాలోని పలువురు జర్నలిస్టులు, సామాజిక సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ రామని అశోక్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!