📄 ePaper
Friday, August 7, 2026
📄 ePaper
HomeతెలంగాణKamareddyరామేశ్వర్ పల్లి రామాలయ నిర్మాణానికి రూ.5 లక్షల భారీ విరాళం ప్రకటించిన పారిశ్రామికవేత్త గన్నవరం చంద్రమౌళీశ్వర్...

రామేశ్వర్ పల్లి రామాలయ నిర్మాణానికి రూ.5 లక్షల భారీ విరాళం ప్రకటించిన పారిశ్రామికవేత్త గన్నవరం చంద్రమౌళీశ్వర్ రెడ్డి…

బిక్కనూరు, జూలై 02 (నవజ్యోతి ప్రతినిధి):

బిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి గ్రామంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న శ్రీ రామాలయ నిర్మాణ పనుల కొరకు హైదరాబాద్ వాస్తవ్యులు, ప్రముఖ సామాజిక సేవకులు శ్రీ గన్నవరం చంద్రమౌళీశ్వర్ రెడ్డి గారు ఐదు లక్షల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించారు. వారి ఉదారతకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు కలిసి చంద్రమౌళీశ్వర్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ మద్ది చంద్రకాంత్ రెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు శ్రీ మద్ది సూర్యకాంత్ రెడ్డి, గ్రామ సర్పంచ్ శ్రీమతి చేపూరి రాణి రాజు, ఉపసర్పంచ్ శ్రీ గొల్లపల్లి వినోద్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.

అలాగే మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీ నాగర్తి రమేష్ రెడ్డి, టెంపుల్ కమిటీ డైరెక్టర్ శ్రీ రమేష్ రెడ్డి, ఆలయ వాస్తు పరిశీలకులు శ్రీ శంకరప్ప, కందడి బాల్ రెడ్డి, బీఎంఎస్ నాయకులు శ్రీ రవీందర్ రెడ్డి, అఖిలపక్ష నాయకులు, వార్డు సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

©- నవజ్యోతి వెబ్ డెస్క్

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!