📄 ePaper
Tuesday, September 29, 2026
📄 ePaper
Homeమెదక్బీజేపీ యువ మోర్చా మెదక్ జిల్లా ఇన్‌చార్జిగా ప్రదీప్‌రావు నియామకం

బీజేపీ యువ మోర్చా మెదక్ జిల్లా ఇన్‌చార్జిగా ప్రదీప్‌రావు నియామకం

బిజెవైఎం రాష్ట్ర కార్యదర్శికి మెదక్ జిల్లా ఇన్‌చార్జి గా బాధ్యతలు

మెదక్, సెప్టెంబర్‌ 17 (నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్):

భారతీయ జనతా పార్టీ యువమోర్చా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వివిధ జిల్లాలకు యువమోర్చా ఇన్‌చార్జీలను నియమిస్తూ బుధవారం ప్రకటన విడుదలైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌. రామచంద్రరావు ఆదేశాల మేరకు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే నేతృత్వంలో ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇందులో భాగంగా బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్‌రావు లింగంపల్లిని మెదక్ జిల్లా యువమోర్చా ఇన్‌చార్జిగా నియమించారు. రాష్ట్ర కార్యదర్శి హోదాలో ఉన్న ప్రదీప్‌రావుకు మెదక్ జిల్లా యువమోర్చా కార్యకలాపాలను సమన్వయం చేసే బాధ్యతలను అప్పగించారు. జిల్లాలో యువమోర్చా సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడం, యువతను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం, మండల స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేయడంలో ఆయన కీలకంగా వ్యవహరించనున్నారు.

ఈ సందర్భంగా ప్రదీప్‌రావు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి మెదక్ జిల్లా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించిన పార్టీ రాష్ట్ర నాయకత్వానికి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండేకు కృతజ్ఞతలు తెలిపారు. యువత సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం కృషి చేయడంతో పాటు, యువతను పెద్ద సంఖ్యలో పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తానన్నారు. జిల్లాలో బీజేవైఎంను మరింత చురుకుగా, సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.

ప్రదీప్‌రావుకు మెదక్ జిల్లా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడంపై బీజేపీ జిల్లా నాయకులు, బీజేవైఎం నాయకులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఆయన నాయకత్వంలో జిల్లాలో యువమోర్చా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించేందుకు చర్యలు చేపడతారని నాయకులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!