📄 ePaper
Saturday, October 31, 2026
📄 ePaper
Homeసంగారెడ్డిపెద్దమఠం అభివృద్ధికి లింగాయత్ సమాజం వినతి

పెద్దమఠం అభివృద్ధికి లింగాయత్ సమాజం వినతి

సంగారెడ్డి, నవజ్యోతి : సంగారెడ్డి పట్టణంలోని పెద్దమఠం స్థలంలో శ్రీ లింగానంద్ స్వామివారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు మరింతగా విస్తరించాలని వీరశైవ లింగాయత్ సమాజం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఇప్పపల్లి నర్సింలు ఆకాంక్షించారు. సదాశివపేట పెద్దమఠం అనుసంధానంలో ఉన్న సంగారెడ్డి పట్టణ పెద్దమఠం ద్వారా సంగారెడ్డి జిల్లా లింగాయత్, జంగమ సమాజాల అభివృద్ధికి మరింత సహకారం అందించాలని కోరుతూ ఇప్పపల్లి నర్సింలు ఆధ్వర్యంలోని ప్రతినిధులు శ్రీ లింగానంద్ స్వామివారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ లింగానంద్ స్వామివారు స్పందిస్తూ, సమాజ అభ్యున్నతికి సంబంధించిన ఈ పవిత్రమైన విషయాన్ని ఆలంపల్లి–దుదిని పీఠాధిపతి పరమపూజ్య శ్రీ చెన్న బసవ మహాప్రభు గారి దృష్టికి నాలుగైదు రోజుల్లో తీసుకెళ్లి, వారి సూచనలు మరియు ఆశీర్వాదాలతో తగిన విధంగా తెలియజేస్తానని తెలిపారు. లింగాయత్, జంగమ సమాజాల ఆధ్యాత్మిక, సామాజిక అభివృద్ధికి పెద్దమఠం వేదికగా మరింత సేవ చేయాలని ప్రతినిధులు ఆకాంక్షించారు. స్వామివారి ఆశీస్సులతో సమాజ సేవా కార్యక్రమాలు మరింత బలోపేతం కావాలని భక్తులు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ గందిగే రాజు, సంగారెడ్డి తాలూకా ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల శివకుమార్, సదాశివపేట మండల గౌరవ అధ్యక్షులు ఎద్దుల సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!