ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అండగా లక్ష్మీ రామ్ రెడ్డి సేవ ట్రస్ట్…
విద్యార్థులకు ఆట వస్తువులు, భోజన సదుపాయాలు
మనోహరాబాద్, 14 ఆగష్టు (నవజ్యోతి ప్రతినిధి నవీన్): ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు అండగా నిలిచి వారి సౌకర్యాలు కల్పిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చిట్కుల మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం నాడు మనోహరాబాద్ మండల పరిధిలోని దండుపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు లక్ష్మీ రామిరెడ్డి ట్రస్టు ఆధ్వర్యంలో భోజన ప్లేట్లు, అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు స్కూల్ డ్రెస్సులు, క్రీడా వస్తువులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మల్లారెడ్డి, సర్పంచ్ నాగరాజు, పాక్స్ డైరెక్టర్ జావేద్ పాషా, గౌతోజీగూడా సర్పంచ్ నాగరాజు, నాయకులు పంజా బిక్షపతి, గడ్డి వెంకటేష్ యాదవ్ పాల్గొన్నారు.

