📄 ePaper
Saturday, August 15, 2026
📄 ePaper
Homeసంగారెడ్డినెహ్రూ, రాజీవ్ గాంధీ విగ్రహాలను ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి

నెహ్రూ, రాజీవ్ గాంధీ విగ్రహాలను ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి

  • ఏర్పాట్లను పరిశీలించిన జగ్గారెడ్డి, నిర్మల జగ్గారెడ్డి

సంగారెడ్డి, ఆగస్టు 13 (నవజ్యోతి ప్రతినిధి):

సంగారెడ్డి పట్టణంలోని ఐబీ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన మాజీ ప్రధానమంత్రులు జవహర్‌లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ విగ్రహాలను ఈ నెల 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. సీఎం సంగారెడ్డి పర్యటన నేపథ్యంలో గురువారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి విగ్రహాలు ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని అధికారులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు.

విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, భద్రతా చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు పాల్గొనే ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులకు సంబంధించిన వివరాలను అధికారులతో చర్చించారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ కన్వీనర్ జూలకంటి అంజనేయులు, సీడీసీ చైర్మన్ రామ్‌రెడ్డి, నాయకులు రఘుగౌడ్, జార్జ్, కూన సంతోష్, కిరణ్‌గౌడ్, మహేష్, శ్రీకాంత్, ప్రవీణ్, సందీప్‌రెడ్డి, మొగులయ్య, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!