📄 ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeసంగారెడ్డిపాత్రికేయుల సంక్షేమమే లక్ష్యం : ఎండీ ఇర్షాన్

పాత్రికేయుల సంక్షేమమే లక్ష్యం : ఎండీ ఇర్షాన్

సంగారెడ్డి, నవజ్యోతి ప్రతినిధి:

టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యుడిగా (ఈసీ మెంబర్) ఎన్నిక కావడం పట్ల తెలుగు దినపత్రిక స్టాఫ్ రిపోర్టర్ ఎండీ ఇర్షాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తనకు అవకాశం కల్పించిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఫైసల్ అహ్మద్, జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి, జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ ఎన్ విలాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు, సంఘ ప్రతినిధులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పాత్రికేయుల సంక్షేమం, వారి వృత్తిపరమైన హక్కుల పరిరక్షణ, చిన్న, మధ్యతరహా పత్రికల అభివృద్ధి కోసం సంఘంతో కలిసి నిరంతరం పనిచేస్తానని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను సంఘం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, సంఘం బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన ఎన్నికకు అభినందనలు తెలిపిన రాష్ట్ర, జిల్లా నాయకులు, పాత్రికేయులు, ప్రజాప్రతినిధులు, మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ ఎండీ ఇర్షాన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!