📄 ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeసంగారెడ్డిఅందరి సహకారంతో బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తా : మన్నే లక్ష్మణ్

అందరి సహకారంతో బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తా : మన్నే లక్ష్మణ్

సంగారెడ్డి, జూలై 09 (నవజ్యోతి ప్రతినిధి) :

టియుడబ్ల్యూటీజే (ఐజేయు) సంగారెడ్డి జిల్లా స్మాల్ అండ్ మీడియం పత్రికల అసోసియేషన్ జిల్లా ట్రెజరర్‌గా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైసల్ అహ్మద్, జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి, జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ ఎన్.విలాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు, సంఘ ప్రతినిధులకు నవజ్యోతి తెలుగు దినపత్రిక ఎడిటర్ మన్నే లక్ష్మణ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి పూర్తి నిబద్ధతతో పనిచేస్తానని అన్నారు. చిన్న, మధ్య తరహా పత్రికల అభివృద్ధి, పాత్రికేయుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ కోసం సంఘంతో కలిసి అంకితభావంతో కృషి చేస్తానని పేర్కొన్నారు. జిల్లాలోని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను సంఘం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేయడంతో పాటు సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు తన వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర, జిల్లా నాయకులు, పాత్రికేయులు, ప్రజాప్రతినిధులు, మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!