యువత ప్రజాస్వామ్య పరిరక్షణలో చురుకైన పాత్ర పోషించాలి: మధుసూదన్‌రెడ్డి…
కామారెడ్డి, ఆగస్టు 9 (నవజ్యోతి ప్రతినిధి):

కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ 66వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి జెండాను ఆవిష్కరించి నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం యువత చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువజన కాంగ్రెస్ కీలకంగా పనిచేస్తుందన్నారు.
గ్రామస్థాయి నుంచి యువజన కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేస్తామని మధుసూదన్‌రెడ్డి తెలిపారు. యువతను పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌లో భాగస్వామ్యం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారంలో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ముందుండాలని సూచించారు.
కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనివాస్, కామారెడ్డి టౌన్ అధ్యక్షుడు అజ్మత్, భిక్కనూరు మండల అధ్యక్షుడు వెంకటేష్, మాచారెడ్డి అధ్యక్షుడు రాజిరెడ్డి, బీబీపేట అధ్యక్షుడు మహేష్, పాల్వంచ అధ్యక్షుడు సమరసింహా, రాము తదితరులు పాల్గొన్నారు.

