భిక్కనూరు, ఆగస్టు 10 (నవజ్యోతి ప్రతినిధి):

భిక్కనూరు మండలం ఈసన్నపల్లి గ్రామంలో ఆషాఢ మాసం చివరి ఆదివారం సందర్భంగా బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వివిధ కుల సంఘాలకు చెందిన మహిళలు అలంకరించిన బోనాలను ఎత్తుకుని గ్రామ ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా వెళ్లి గ్రామదేవతలకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
వేడుకల్లో టీపీసీసీ జనరల్ సెక్రెటరీ ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు పాడిపంటలతో సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు.
అనంతరం స్థానిక నాయకులతో కలిసి ఇంద్రకరణ్‌రెడ్డి గ్రామ విశేషాలను తెలుసుకున్నారు. గ్రామంలో జరుగుతున్న కార్యక్రమాలు, స్థానిక పరిస్థితులపై నాయకులతో చర్చించారు.
కార్యక్రమంలో సర్పంచ్ మేకల రాములు, ఉపసర్పంచ్ బొమ్మగారి రాజమణి శ్రీనివాస్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

