అమ్మవారి ఆశీస్సులతో పట్టణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్ష !
కామారెడ్డి, ఆగస్టు 10 (నవజ్యోతి ప్రతినిధి):

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 38, 30, 40 వార్డుల్లో ఆషాఢమాస మైసమ్మ సహిత పోచమ్మ బోనాల ఉత్సవాలు సోమవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని బోనం ఎత్తుకుని ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆషాఢ బోనాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలన్నారు. అమ్మవారి ఆశీస్సులతో పట్టణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. పట్టణం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.
బోనాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు సంప్రదాయ పద్ధతిలో బోనాలు సమర్పించగా, వార్డుల్లో పండుగ వాతావరణం నెలకొంది.
కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ మోటారి శ్రీకాంత్, కో-ఆప్షన్ సభ్యురాలు గొనె సునీత శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ చాట్ల రాజేశ్వర్, నాయకులు సుకుమార్, సంజీవ్, శ్రీకాంత్, శ్రీనివాస్, నర్సింలు, కిరణ్‌తో పాటు వార్డు ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

