మహిపాల్‌రెడ్డి తల్లి సంవత్సరీకానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు, ఎమ్మెల్యే రోహిత్‌రావు
మనోహరాబాద్, ఆగస్టు 9 (నవజ్యోతి ప్రతినిధి):

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చిట్కుల మహిపాల్‌రెడ్డి తల్లి చిట్కుల లక్ష్మి సంవత్సరీక కార్యక్రమం ఆదివారం మనోహరాబాద్‌లోని శుభం గార్డెన్లో నిర్వహించారు. కార్యక్రమానికి మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్‌రావు ముఖ్య అతిథులుగా హాజరై దివంగత లక్ష్మి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం మహిపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. దివంగతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.
తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వారి పేర్లతో లక్ష్మీ రాంరెడ్డి ట్రస్టును ఏర్పాటు చేసి పేద విద్యార్థులు, నిరుపేదలకు నిరంతరం సేవలు అందించడం అభినందనీయమని నాయకులు కొనియాడారు. సమాజంలో అవసరమైన వారికి అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగించడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో వెంకట్‌రెడ్డి, మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, జావీద్ పాషా, శనిభూషణ్రెడ్డి, గడ్డి వెంకటేష్ యాదవ్, ఉమ్మడి మండలాల సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

