- జానారెడ్డి ఆశీర్వాదం తీసుకున్న అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి
మాడుగులపల్లి, జూలై 3 (నవజ్యోతి ప్రతినిధి) మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన గడ్డం వేణుగోపాల్ రెడ్డి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి కూందూరు జానా రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా గడ్డం వేణుగోపాల్ రెడ్డికి జానారెడ్డి అభినందనలు తెలియజేస్తూ, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, మండలంలోని ప్రతి కార్యకర్తను కలుపుకొని ముందుకు సాగాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేయాలని ఆకాంక్షించారు. గడ్డం వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి రెండోసారి మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్న పార్టీ అధిష్ఠానానికి, నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో పార్టీని మండలంలో మరింత బలోపేతం చేసి, కాంగ్రెస్ విజయానికి అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.

