📄 ePaper
Friday, August 7, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ప్రపంచ బ్యాంకు సహకారంతో సాంకేతిక విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం !

ప్రపంచ బ్యాంకు సహకారంతో సాంకేతిక విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం !

మెరిట్‌ పథకానికి రాష్ట్ర ప్రాజెక్టు కోఆర్డినేటర్‌గా సాంకేతిక విద్య కమిషనర్‌..

హైదరాబాద్, ఆగస్టు 6 (నవజ్యోతి ప్రతినిధి):

కేంద్ర విద్యాశాఖ, ప్రపంచ బ్యాంకు సంయుక్తంగా అమలు చేస్తున్న మెరిట్‌ (MERITE) పథకం అమలుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం రాష్ట్ర స్థాయి అమలు కోసం సాంకేతిక విద్య కమిషనర్‌ను రాష్ట్ర ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ (SPC)గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మెరిట్‌ పథకం ద్వారా రాష్ట్రంలోని సాంకేతిక విద్యా సంస్థల్లో బోధన ప్రమాణాల మెరుగుదల, పరిశోధనకు ప్రోత్సాహం, మౌలిక వసతుల అభివృద్ధి, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాల పెంపు, బహుళ విభాగాల విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

పథకం సమర్థవంతమైన అమలు కోసం రాష్ట్ర స్థాయిలో సాంకేతిక విద్య కమిషనర్‌ సమన్వయ బాధ్యతలు నిర్వహించనున్నారు. దీంతో రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌, సాంకేతిక విద్యా సంస్థలకు గణనీయమైన ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!