ఓటరు జాబితాపై కన్నేయండి.. మీ పేరు ఉందో లేదో చూసుకోండి!
హైదరాబాద్, ఆగస్టు 9 (నవజ్యోతి న్యూస్): ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికల జాబితాలపై రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు దృష్టి సారిస్తున్నాయి. అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని, అనర్హమైన లేదా పునరావృత నమోదులను గుర్తించడంతో పాటు నిజమైన ఓటర్ల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రత్యేక సవరణ ప్రక్రియలో ఓటర్ల వివరాల పరిశీలన, ధ్రువీకరణ, కొత్తగా నమోదు, మార్పులు, తొలగింపులు వంటి అంశాలు కీలకంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఓటరు తన పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో పరిశీలించుకోవడం అవసరం. పేరు, చిరునామా, ఇతర వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించి సరిదిద్దుకోవాలని సూచిస్తున్నారు.

