📄 ePaper
Tuesday, September 29, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఓటే వద్దంటున్న మహా నగరం..!

ఓటే వద్దంటున్న మహా నగరం..!

హైదరాబాద్‌లో చల్లబడిన ఓటు ఆసక్తి.. 56.80 లక్షల ఫారాలు ఇంకా బీఎల్‌వోల దగ్గరే..

హైదరాబాద్, ఆగస్టు 6 (నవజ్యోతి ప్రతినిధి): ఓటు హక్కు కోసం ఒకప్పుడు ఉద్యమాలు చేసిన తెలంగాణలో.. ఇప్పుడు ఓటర్ల నిర్లక్ష్యం ఎన్నికల అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియకు ఆశించిన స్పందన లేకపోవడంతో లక్షల సంఖ్యలో ఎన్యూమరేషన్ ఫారాలు ఇంకా బూత్ లెవల్ అధికారుల (BLO) వద్దే ఉండిపోయాయి.

రాష్ట్రవ్యాప్తంగా 56.80 లక్షల ఫారాలు ఇంకా పంపిణీ కాకుండానే ఉండగా, వాటిలో 47.36 లక్షలు హైదరాబాద్‌కే చెందినవి. ఇప్పటివరకు నగరంలో 27.33 లక్షల ఫారాలు మాత్రమే తిరిగి సమర్పించబడినట్లు సమాచారం. ఈ పరిస్థితి కారణంగా స్పందించని వారి పేర్లు ‘Absent, Dead, Shifted’ జాబితాలో చేరే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

హైటెక్ సిటీ, గచ్చిబౌలి, షేర్లింగంపల్లి వంటి ప్రాంతాల్లో నివసిస్తున్న ఇతర రాష్ట్రాల ప్రజలు తమ స్వస్థలాల్లోనే ఓటు హక్కు కొనసాగించాలని ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, హైరైజ్ అపార్ట్‌మెంట్లలో నివసించే పలువురు స్థానికులు కూడా ఫారాలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదని ఎన్నికల సిబ్బంది చెబుతున్నారు.

బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఫారాలు అందించినా, ఫోన్ చేసినా పెద్దగా స్పందన కనిపించడం లేదని సమాచారం. అయితే దిగువ, మధ్యతరగతి ప్రాంతాల్లో మాత్రం ఓటరు నమోదు ప్రక్రియకు మంచి స్పందన లభిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్న నేపథ్యంలో, స్పందించని ఓటర్లు వెంటనే తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కు కోల్పోయే పరిస్థితి ఎదురయ్యే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!