📄 ePaper
Wednesday, September 30, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్తూప్రాన్‌లో భారీ చోరీ!

తూప్రాన్‌లో భారీ చోరీ!

రూ.4 లక్షల నగదు.. 5 తులాల బంగారం.. కిలోన్నర వెండి అపహరణ

వరుస దొంగతనాలతో తూప్రాన్‌ ప్రజల్లో భయాందోళనలు

తూప్రాన్‌, ఆగస్టు 13 (నవజ్యోతి ప్రతినిధి):
తూప్రాన్‌ పట్టణంలో వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పట్టణంలోని బ్రాహ్మణ వీధికి చెందిన కామేష్‌, ఆయన భార్య గాయత్రి సాయిలక్ష్మి ఈ నెల 11న బంధువుల ఇంటికి వెళ్లి గురువారం ఉదయం తిరిగి వచ్చారు. ఇంటి తాళాలు, తలుపులు పగలగొట్టి ఉండటాన్ని గుర్తించి లోపలికి వెళ్లి చూడగా బీరువాలో దాచిన రూ.4 లక్షల నగదు, 5 తులాల బంగారు ఆభరణాలు, కిలోన్నర వెండి వస్తువులు కనిపించలేదు.

సీసీ కెమెరాలపై పోలీసుల దృష్టి

చోరీ విషయం తెలుసుకున్న తూప్రాన్‌ సీఐ వెంకట్‌ రాజా గౌడ్‌, ఎస్‌ఐ గంగరాజు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌ ఆధారాలు సేకరించింది. నిందితుడిని గుర్తించి పట్టుకునేందుకు కాలనీలోని సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.

ప్రజలకు పోలీసుల సూచనలు: ఇంటి భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఊరికి వెళ్లే సమయంలో ఇంట్లో విలువైన బంగారు, వెండి వస్తువులు ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!