సంగారెడ్డి, జూలై 06 (నవజ్యోతి ప్రతినిధి) :
జనవరి–2026లో తెలంగాణ స్టేట్ టెక్నికల్ బోర్డు నిర్వహించిన టైప్‌రైటింగ్ పరీక్షల్లో శ్రీ ధరణి టైప్‌రైటింగ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన విద్యార్థిని కుమారి పత్తి లక్ష్మి ప్రణతి రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు సాధించి ప్రతిభ చాటింది.
టైప్‌రైటింగ్ తెలుగు లోయర్ గ్రేడ్ పరీక్షలో ఆమె 200 మార్కులకు గాను 179 మార్కులు సాధించి రాష్ట్రంలో తృతీయ స్థానం దక్కించుకుందని ఇనిస్టిట్యూట్ ప్రిన్సిపాల్ బి. కృష్ణమూర్తి తెలిపారు. విద్యార్థిని సాధించిన ఈ విజయం ఇనిస్టిట్యూట్‌కు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా లక్ష్మి ప్రణతిని ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థిని విజయంలో తల్లిదండ్రుల సహకారంతో పాటు ఇనిస్టిట్యూట్ అధ్యాపకుల శిక్షణ కూడా కీలక పాత్ర పోషించిందని తెలిపారు.

