📄 ePaper
Wednesday, August 5, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్వర్షాలకు కూలిన ఇల్లు.. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్..

వర్షాలకు కూలిన ఇల్లు.. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్..

 

  • ప్రభుత్వం నుంచి సాయం అందేలా కృషి చేస్తామని హామీ…

భిక్కనూరు, జూలై 29 (నవజ్యోతి ప్రతినిధి):

భిక్కనూరు మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన బైండ్ల పరుశురాములు నివాసం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కూలిపోయింది. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ కోడూరు సాయిగౌడ్ ఘటనాస్థలికి చేరుకుని కూలిన ఇంటిని పరిశీలించారు.

బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున అందుబాటులో ఉన్న సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే అధికారులు వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి తగిన ఆర్థిక సాయం అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, చైతన్య కొండల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు బాగా రెడ్డి, వార్డు సభ్యులు, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!