📄 ePaper
Thursday, August 6, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్బిక్కనూరు పీహెచ్‌సీ సేవలపై రాష్ట్ర డైరెక్టర్ ప్రశంసలు!

బిక్కనూరు పీహెచ్‌సీ సేవలపై రాష్ట్ర డైరెక్టర్ ప్రశంసలు!

సీజనల్ వ్యాధుల నియంత్రణపై అధికారులతో సమీక్ష..

బిక్కనూరు , జూలై 29 (నవజ్యోతి ప్రతినిధి):

జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణ, సంసిద్ధతతో పాటు ఇతర ఆరోగ్య కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సంచాలకులు డా. రవీందర్ నాయక్ బుధవారం కామారెడ్డి జిల్లాను ఆకస్మికంగా సందర్శించారు.

ఈ సందర్భంగా బిక్కనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి, అక్కడ అందుతున్న వైద్య సేవలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పీహెచ్‌సీ వైద్యాధికారి డా. ఏమీమా అందిస్తున్న సేవలను అభినందించారు.

అనంతరం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రోగ్రాం ఆఫీసర్లు, జిల్లా వైద్యాధికారులతో జూమ్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధుల నివారణకు చేపట్టాల్సిన ప్రత్యేక కార్యాచరణ, ముందస్తు చర్యలపై అధికారులకు పలు సూచనలు చేసి తగు ఆదేశాలు జారీ చేశారు.

సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా. వెంకటి, ప్రోగ్రాం ఆఫీసర్లు డా. రాజు, డా. వెంకటస్వామి, డా. రోహిత్, డా. ప్రదీప్, డా. నర్సింగ్ చౌహాన్, ఏఎంఓ శ్రీనివాస్ రెడ్డి, డెమో మహేందర్ రెడ్డి, హెచ్‌ఈ వేణుగోపాల్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!