📄 ePaper
Sunday, August 9, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్రోటరీ క్లబ్ సేవలు ఆదర్శనీయం.. శ్రీ సరస్వతి శిశు మందిర్‌కు భారీ విరాళం !

రోటరీ క్లబ్ సేవలు ఆదర్శనీయం.. శ్రీ సరస్వతి శిశు మందిర్‌కు భారీ విరాళం !

రూ.1.50 లక్షల క్రీడా సామగ్రి, 50 బెంచీల అందజేత | విద్యార్థుల భవిష్యత్తుకు దాతల సహకారం గొప్పది: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి…

మిర్యాలగూడ, ఆగస్టు 6 (నవజ్యోతి ప్రతినిధి):

పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్‌లో విద్యార్థుల అభ్యున్నతి కోసం రోటరీ క్లబ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాలకు రూ.1.50 లక్షల విలువైన క్రీడా సామగ్రితో పాటు 50 బెంచీలను అందించడం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.

బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు మాశెట్టి శ్రీనివాస్‌తో కలిసి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాఠశాల ప్రబంధకారిణి సమితి అధ్యక్షుడు గౌరు దయాకర్‌కు క్రీడా సామగ్రి, బెంచీలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దాతలు అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. నైతిక విలువలు, క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తూ సామాజిక బాధ్యతను పెంపొందిస్తున్న శ్రీ సరస్వతి శిశు మందిర్ వంటి విద్యాసంస్థల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా విద్యాసంస్థల అభివృద్ధికి సమాజంలోని అన్ని వర్గాలు ముందుకు రావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి చిలుకూరు బాలు, కాంగ్రెస్ నాయకులు గుడిపాటి నవీన్, ఇమ్రాన్, కౌన్సిలర్ ఇంద్రకుమార్, రోటరీ క్లబ్ సభ్యులు విశ్వనాథ్, సిమ్రాన్ మైనీ, అశోక్ కుమార్, మాశెట్టి వీరయ్య, రేపాల అంతయ్య, సుదర్శన్, ఇన్నర్ వీల్ సభ్యులు మాశెట్టి భాగ్యలక్ష్మి, రేపాల వాసవి, గౌరు సీత, శ్రీ సరస్వతి శిశు మందిర్ సభ్యులు మురహరి, అనంతరెడ్డి, యామిని, వెంకటేశ్వర్లు, గూడూరు శ్రీనివాసరావు, బండారు ప్రసాద్, తిప్పన వెంకటేశ్వర్ రెడ్డి, రంగారావు, జగన్ శర్మ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చెన్నూరు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!