యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో ప్రశాంతంగా కొనసాగిన ఆందోళన
భిక్కనూరు, జూలై 24 (నవజ్యోతి ప్రతినిధి):
నీట్ పేపర్ లీకేజీ ఘటనకు నిరసనగా విద్యార్థి సంఘాల పిలుపుమేరకు యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో శుక్రవారం భిక్కనూరులో ప్రభుత్వ జూనియర్ కళాశాల బంద్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ చేపట్టిన ఈ బంద్కు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కూడా స్వచ్ఛందంగా సహకరించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బంద్ ప్రశాంతంగా సాగింది.
ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్, నాయకులు తిరుపతి, చిరంజీవితో పాటు యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ కార్యకర్తలు పాల్గొన్నారు.

