భిక్కనూరు, ఆగస్టు 20 (నవజ్యోతి ప్రతినిధి):

భిక్కనూరు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో
వసతులు, పారిశుధ్యం, విద్యార్థుల నుంచి రూ.200 ఫైన్ వసూలు చేస్తున్నారనే
ఆరోపణలపై నవజ్యోతి వెబ్‌లో ప్రచురితమైన
కథనానికి అధికారులు స్పందించారు. బుధవారం మధ్యాహ్నం 3.45 గంటలకు
మండల విద్యాధికారి రాజగంగారెడ్డి ఆకస్మికంగా గురుకులాన్ని
తనిఖీ చేశారు. నవజ్యోతి ప్రతినిధితో కలిసి పాఠశాలలోని వసతులు,
పారిశుధ్య పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
రూ.200 ఫైన్‌పై విద్యార్థులను ఆరా
గైర్హాజరైన విద్యార్థుల నుంచి రూ.200 ఫైన్ వసూలు చేస్తున్నారనే ఆరోపణపై
ఎంఈఓ పలువురు విద్యార్థులను యాదృచ్ఛికంగా ఎంపిక చేసి వివరాలు అడిగి
తెలుసుకున్నారు. విద్యార్థులు తాము రూ.200 ఫైన్ చెల్లించలేదని చెప్పినట్లు
అధికారులు తెలిపారు. దీంతో ఫైన్ వసూలు చేసినట్లు నిర్ధారించే ఆధారాలు
తనిఖీలో కనిపించలేదని ఎంఈఓ పేర్కొన్నారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్
వెంకటేశ్వర్లును కూడా దీనిపై వివరణ కోరగా, వెంటనే విచారణ చేపట్టినట్లు
తెలిపారు.
వాష్‌రూమ్‌లను పరిశీలించిన ఎంఈఓ
పాఠశాలలోని మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్వహణను ఎంఈఓ రాజగంగారెడ్డి,
నవజ్యోతి ప్రతినిధి కలిసి పరిశీలించారు. ఒక టాయిలెట్ బ్లాక్‌లో మరమ్మతు
పనులు కొనసాగుతున్నట్లు గుర్తించారు. మరో బ్లాక్ వినియోగంలో ఉన్నట్లు
తెలిపారు. కొన్ని టాయిలెట్లు బ్లాక్ కావడానికి చిన్నపిల్లలు బట్టలు,
చెడ్డీలు తదితర వస్తువులు వేయడం కారణమవుతోందని ఉపాధ్యాయులు
వివరించినట్లు అధికారులు తెలిపారు.
కిచెన్‌లో ఈగలు.. చర్యలకు ఆదేశం
వంటగదిని పరిశీలించిన సమయంలో పాత్రలు కడిగే ప్రాంతంలో
కొన్ని ఈగలు కనిపించడంతో
ఎంఈఓ అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే ఇన్చార్జి ప్రిన్సిపాల్,
సంబంధిత సిబ్బంది, కేటరింగ్ కాంట్రాక్టర్‌కు ఈగల నివారణకు చర్యలు
తీసుకోవాలని ఆదేశించారు. వంటశాల, భోజన ప్రదేశాల పరిశుభ్రతపై ప్రత్యేక
శ్రద్ధ వహించాలని సూచించారు.
స్టోర్ రూమ్ శుభ్రంగా..
తనిఖీలో భాగంగా స్టోర్ రూమ్‌ను కూడా పరిశీలించగా శుభ్రంగా ఉన్నట్లు
అధికారులు గుర్తించారు. పాఠశాలలో నిర్వహణకు సంబంధించిన సుమారు
20 పనులు కొనసాగుతున్నాయని, అవి త్వరలో పూర్తవుతాయని
తెలిపారు.
విద్యార్థులతో నేరుగా మాట్లాడి..
ఎంఈఓ 6, 8, 9వ తరగతుల విద్యార్థులతో నేరుగా మాట్లాడి పాఠశాలలోని
వసతులు, ఎదురవుతున్న సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులు
ప్రత్యేకంగా ఎలాంటి ఫిర్యాదు చేయలేదని అధికారులు తెలిపారు. విద్యార్థుల
ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన అంశాల్లో నిర్లక్ష్యం లేకుండా చూడాలని
సిబ్బందికి సూచించారు.
పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ
వంటశాల నిర్వాహకులు, టాయిలెట్ల నిర్వహణ సిబ్బంది పరిశుభ్రత అంశాలపై
ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎంఈఓ ఆదేశించారు. పాఠశాలలో కొనసాగుతున్న
నిర్వహణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. విద్యార్థుల
ఆరోగ్యం, భద్రత విషయంలో నిర్లక్ష్యం లేకుండా చర్యలు తీసుకోవాలని
సంబంధిత సిబ్బందికి స్పష్టం చేశారు.
నవజ్యోతి ప్రతినిధితో కలిసి గురుకులాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
రూ.200 ఫైన్ ఆరోపణపై విద్యార్థులను అడిగి తెలుసుకోవడంతో పాటు
వాష్‌రూమ్‌లు, కిచెన్, స్టోర్ రూమ్ తదితర ప్రాంతాలను పరిశీలించారు.
కిచెన్‌లో కనిపించిన ఈగల నివారణకు వెంటనే చర్యలు తీసుకోవాలని
సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

