📄 ePaper
Thursday, August 6, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్హెచ్‌ఏఎల్‌లో 120 ట్రైనీ పోస్టులు..!

హెచ్‌ఏఎల్‌లో 120 ట్రైనీ పోస్టులు..!

డిఫెన్స్ పీఎస్‌యూలో ఉద్యోగాలకు భారీ అవకాశం..

హైదరాబాద్, ఆగస్టు 5 (నవజ్యోతి ప్రతినిధి): రక్షణ రంగ ప్రభుత్వ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) 120 డిజైన్ ట్రైనీ (DT), మేనేజ్‌మెంట్ ట్రైనీ (MT) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న హెచ్‌ఏఎల్ విభాగాలు, పరిశోధన కేంద్రాలు, కార్యాలయాల్లో ఈ నియామకాలు చేపట్టనున్నారు.

మొత్తం 120 పోస్టుల్లో 60 డిజైన్ ట్రైనీ, 60 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు ఉన్నాయి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, మెటలర్జీ, ఏరోనాటికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ప్రొడక్షన్, సివిల్ తదితర ఇంజినీరింగ్ విభాగాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ జూలై 29 నుంచి ప్రారంభమైంది. ఆగస్టు 14 మధ్యాహ్నం 2 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఎంపిక ప్రక్రియ, అర్హతలు, వయోపరిమితి తదితర పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉన్నాయి.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!