📄 ePaper
Wednesday, August 5, 2026
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్ఎక్సలెన్స్ ఇన్ టెక్నాలజీ అవార్డుకు ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ ఎంపిక

ఎక్సలెన్స్ ఇన్ టెక్నాలజీ అవార్డుకు ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ ఎంపిక

సంగారెడ్డి, జూలై 28 (నవజ్యోతి న్యూస్):
కందిలోని ఐఐటీ హైదరాబాద్ మెకానికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నిషాంత్ నీనా సక్సేనా ప్రతిష్ఠాత్మక ఎక్సలెన్స్ ఇన్ టెక్నాలజీ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డును ఐఐటీ ఖరగ్‌పూర్ ప్లాటినం జూబ్లీ వేడుకల సందర్భంగా ప్రకటించారు.

సాంకేతిక ఆవిష్కరణలు, వాటిని విజయవంతంగా వాణిజ్యీకరించడంలో చూపిన విశిష్ట కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం అందజేస్తారు. డాక్టర్ నిషాంత్ నీనా సక్సేనా సాధించిన ఈ ఘనత ఐఐటీ హైదరాబాద్‌కు మరో ప్రతిష్ఠను తీసుకువచ్చింది.

ఈ సందర్భంగా ఐఐటీ హైదరాబాద్ అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. సాంకేతిక రంగంలో పరిశోధనలను సమాజ అవసరాలకు అనుగుణంగా మలుస్తూ వినూత్న ఆవిష్కరణలకు ఆయన అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!