కుత్బుల్లాపూర్, జూలై 16 (నవజ్యోతి ప్రతినిధి): పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంపల్లి ఫ్లైఓవర్ నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కింద ఓ వ్యక్తి హత్యకు గురైన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో బుధవారం అర్ధరాత్రి మద్యం మత్తులో అడ్డా కూలీల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. మృతుడిని నర్శింహులుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పేట్ బషీరాబాద్ పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

