📄 ePaper
Thursday, August 13, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కేరళ లో అటవీ సిబ్బందిపై అడవి ఏనుగు దాడి !

కేరళ లో అటవీ సిబ్బందిపై అడవి ఏనుగు దాడి !

ఏనుగు దాడిలో ముగ్గురికి గాయాలు.. ఒకరి భుజానికి ఫ్రాక్చర్‌

త్రిశూర్‌, ఆగస్టు 13 (నవజ్యోతి ప్రతినిధి):
కేరళలోని త్రిశూర్‌ జిల్లా తుంబూర్ముజి వద్ద అటవీ సిబ్బందిపై అడవి ఏనుగు దాడి చేసింది.
బుధవారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు అటవీ శాఖ
సిబ్బందికి గాయాలయ్యాయి.

నైట్‌ పెట్రోలింగ్‌కు వెళ్లగా..

సౌర విద్యుత్‌ కంచెను దాటి బయటకు వచ్చిన ఓ అడవి ఏనుగు కోసం అటవీ సిబ్బంది నైట్‌ పెట్రోలింగ్‌
నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బీట్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ సచి, వాచర్లు
నటరాజన్‌, మణికందన్‌ ఏనుగు కదలికలను పరిశీలించేందుకు వెళ్లారు.

రోడ్డుపైకి అకస్మాత్తుగా దూసుకొచ్చిన ఏనుగు.. దాన్ని చూసిన అటవీ సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీశారు.

ఏనుగు ఒక్కసారిగా సిబ్బందిపైకి దూసుకురావడంతో వారు తప్పించుకునేందుకు ప్రయత్నించారు.
ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. ముఖ్యంగా వాచర్‌ మణికందన్‌ భుజానికి ఫ్రాక్చర్‌
అయినట్లు సమాచారం. బీట్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ సచి, మరో వాచర్‌ నటరాజన్‌కు కూడా గాయాలయ్యాయి.

సౌర కంచె దాటి వచ్చిన ఏనుగు

సౌర విద్యుత్‌ కంచెను దాటి ఏనుగు బయటకు రావడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు.
దాని కదలికలను గుర్తించి తిరిగి అడవిలోకి మళ్లించేందుకు సిబ్బంది పెట్రోలింగ్‌ చేపట్టిన
సమయంలోనే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.

ముగ్గురికి గాయాలు:
బీట్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ సచి, వాచర్లు నటరాజన్‌, మణికందన్‌ గాయపడగా.. మణికందన్‌ భుజానికి
ఫ్రాక్చర్‌ అయినట్లు సమాచారం.

అటవీ ప్రాంతాల్లో ఏనుగుల సంచారం పెరుగుతున్న నేపథ్యంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాల్సిన
అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు. ఏనుగు కదలికలను పర్యవేక్షిస్తూ స్థానికులకు కూడా
అప్రమత్తతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!