ఆదాయ వనరుల పెంపు, ఆర్థిక సంస్కరణలు, పెట్టుబడుల ఆకర్షణపై విస్తృతంగా చర్చ
హైదరాబాద్, ఆగస్టు 8 (నవజ్యోతి ప్రతినిధి): ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్‌తో సమావేశమై తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే అంశాలపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర ఆదాయ వనరుల పెంపు, ఆర్థిక సంస్కరణల అమలు, ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసే మార్గాలపై అభిప్రాయాలు పంచుకున్నారు.
రాష్ట్ర ఆదాయ వనరులను విస్తరించడం, ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టంగా తీర్చిదిద్దడం కోసం చేపట్టాల్సిన సంస్కరణలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. ఎక్సైజ్, జీఎస్టీ రంగాల్లో అవసరమైన మార్పులతో పాటు ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసే అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు.
వ్యాపారాలు, పరిశ్రమలకు మరింత అనుకూల వాతావరణం కల్పించడం ద్వారా దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచే విధానాలపై పలు సూచనలు పరిశీలించారు.
తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసి పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాల విస్తరణకు బలమైన పునాది వేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

