📄 ePaper
Saturday, September 12, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్భిక్కనూరు టోల్‌గేట్‌ వద్ద ట్రాఫిక్‌ నరకం!

భిక్కనూరు టోల్‌గేట్‌ వద్ద ట్రాఫిక్‌ నరకం!

వినాయక చవితి రద్దీకి తోడు నిర్మాణ పనులు.. తనిఖీలతో మరింత ఇక్కట్లు
బిక్కనూర్‌, సెప్టెంబర్‌ 12 (నవజ్యోతి ప్రతినిధి):
వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్‌ నుంచి స్వగ్రామాలకు బయలుదేరిన వాహనాలతో బిక్కనూర్‌ టోల్‌గేట్‌ వద్ద
ప్రస్తుతం భారీగా ట్రాఫిక్‌ రద్దీ కొనసాగుతోంది. సుమారు 500 మీటర్ల మేర వాహనాలు బారులు తీరడంతో
ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
టోల్‌గేట్‌ పరిసరాల్లో కొనసాగుతున్న నిర్మాణ పనులతో
రహదారి ఇరుకుగా మారడం, పండుగ సందర్భంగా ఒక్కసారిగా వాహనాల సంఖ్య పెరగడం రద్దీకి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

ట్రాఫిక్‌ కంట్రోల్‌.. లేక ట్రాఫిక్‌కే ‘కంట్రోల్‌’?

ఇప్పటికే వాహనాలు బారులు తీరిన పరిస్థితుల్లో టోల్‌గేట్‌ సమీపంలో ట్రాఫిక్‌ నియంత్రణ బాధ్యతలు
నిర్వర్తించే అధికారులు వాహనాల తనిఖీలకు ప్రాధాన్యం ఇవ్వడంతో రాకపోకలకు మరింత అంతరాయం కలుగుతోందన్న
అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

భద్రత కోసం చేపట్టే తనిఖీలు అవసరమే.. అయితే ట్రాఫిక్‌ సజావుగా సాగాల్సిన సమయంలో అవే చర్యలు
అదనపు అడ్డంకిగా మారకుండా చూడాల్సిన అవసరం ఉంది.
రద్దీని నియంత్రించాల్సిన సమయంలో
వాహనాల ప్రవాహానికి ఆటంకం కలగకుండా అధికారులు సమయాన్ని, ప్రదేశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని
వాహనదారులు కోరుతున్నారు.

తనిఖీలు చేయొచ్చు.. ట్రాఫిక్‌ ఆపకుండా చేయలేరా?

వాహనాల తనిఖీలు భద్రతా పరంగా అవసరమే. అయితే భారీ రద్దీ ఉన్న టోల్‌గేట్‌ వద్దే వాహనాలను నిలిపివేయకుండా,
ముందుగానే వాహనాలను సురక్షితంగా పక్కకు మళ్లించే ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తే ప్రధాన రహదారిపై
రాకపోకలకు అంతరాయం తగ్గుతుందని వాహనదారులు సూచిస్తున్నారు.

పండుగ రద్దీ తెలిసినా.. ప్రత్యేక ఏర్పాట్లు ఏవి?

వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్‌ నుంచి జిల్లాల వైపు భారీగా వాహనాలు వస్తాయన్న విషయం ముందే తెలిసినప్పటికీ
టోల్‌గేట్‌ వద్ద ప్రత్యేక ట్రాఫిక్‌ నిర్వహణ చర్యలు మరింత పటిష్టంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది.
నిర్మాణ పనులు కొనసాగుతున్న పరిస్థితుల్లో రద్దీని దృష్టిలో పెట్టుకుని వాహనాలను క్రమబద్ధీకరించడంతో పాటు
తనిఖీలకు ప్రత్యామ్నాయ ప్రాంతాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉంది.

సజావు ప్రయాణానికి సమన్వయం అవసరం

నిర్మాణ పనులతో రహదారి ఇరుకుగా ఉన్న సమయంలో పండుగ రద్దీ మరింత పెరిగినందున
టోల్‌గేట్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ప్రవాహంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
తనిఖీలు, భద్రతా చర్యలు ఒకవైపు.. వాహనాల సజావు రాకపోకలు మరోవైపు సమన్వయంతో
జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

📢 ప్రయాణికుల విజ్ఞప్తి

“తనిఖీలు వద్దనడం లేదు.. కానీ ట్రాఫిక్‌ను మరింత పెంచేలా కాకుండా చేయండి”
అంటూ వాహనదారులు కోరుతున్నారు. పండుగ వేళ ప్రజలు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరేలా
ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!