సంగారెడ్డి జిల్లా పరిధిలోని 6 నుండి 9వ తరగతి విద్యార్థుల కోసం 2026-27 సంవత్సరానికి గాను దీన్ దయాల్ స్పర్శ్ పథకానికి స్కాలర్షిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని సంగారెడ్డి డివిజన్ పోస్టల్ ఎస్పీ డి. శ్రీహరి ఒక ప్రకటనలు తెలిపారు.
పిల్లలలో ఫిలాటలీ పట్ల ఆసక్తిని పెంపొందించడం , స్టాంపుల సేకరణను ఒక హాబీగా ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశమని ఎస్పీ అన్నారు. 6 వ తరగతి నుండి 9తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులని తెలిపారు. దీని కింద ఎంపికైన ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 6000/- చొప్పున స్కాలర్‌షిప్ అందించబడుననీ తెలిపారు. (త్రైమాసికానికి రూ. 1500/- చొప్పున).
ఆసక్తి గల విద్యార్థులు తమ దరఖాస్తులను నిర్ణీత ఫార్మాట్ లో 15.09.2026 లోపు సంగారెడ్డి డివిజన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ కార్యాలయానికి సమర్పించవలెననీ ఎస్పీ తెలిపారు. వెబ్ సైట్: https://www.indiapost.gov.in/sparsh-philately ద్వారా దరఖాస్తు ఫారం పొందవచ్చని వివరించారు. కావున అర్హులైన విద్యార్థులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పోస్టల్ ఎస్పీ డి.శ్రీహరి కోరారు.

