📄 ePaper
Thursday, October 1, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్భర్తను వదిలేసి.. కండక్టర్‌తో వెళ్లిపోయిన భార్య!

భర్తను వదిలేసి.. కండక్టర్‌తో వెళ్లిపోయిన భార్య!

యూట్యూబర్‌ అఖిల్‌ ఎన్‌ఆర్‌డీ భార్య మేఘ ఇంటి నుంచి వెళ్లిపోవడంపై సోషల్‌ మీడియాలో ప్రచారం

కేరళ, ఆగస్టు 12 (నవజ్యోతి ప్రతినిధి): మలయాళ యూట్యూబర్‌, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ అఖిల్‌ ఎన్‌ఆర్‌డీ భార్య మేఘ ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆమె స్థానిక బస్సు కండక్టర్‌తో వెళ్లిపోయిందనే ప్రచారం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అఖిల్‌, మేఘ 2024లో వివాహం చేసుకున్నారు. మేఘ కూడా సోషల్‌ మీడియా కంటెంట్‌లో కనిపించేవారు. తాజాగా ఆమె ఇంటి నుంచి లగేజీతో బయటకు వస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. బయట ఓ వ్యక్తి వేచి ఉండగా.. అనంతరం ఇద్దరూ కలిసి వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.

కండక్టర్‌తో వెళ్లిపోయిందనే ప్రచారం

ఆ వ్యక్తి స్థానిక బస్సు కండక్టర్‌ అని, అతడితో మేఘకు సంబంధం ఉందనే ఆరోపణలు సోషల్‌ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలకు ఇప్పటివరకు స్వతంత్ర అధికారిక ధ్రువీకరణ లభించలేదు.

మరోవైపు అఖిల్‌ సన్నిహితుడు, మాజీ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ సాయి కృష్ణ ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. సోషల్‌ మీడియాలో ఎవరినీ తొందరపడి నిందించవద్దని కోరినట్లు సమాచారం. అధికారిక వివరాలు వెలువడే వరకు ప్రచారాన్ని వాస్తవంగా భావించవద్దని సూచించారు.

ప్రస్తుతం మేఘ ఇంటి నుంచి ఎందుకు వెళ్లిపోయారు? కండక్టర్‌తో ఆమెకు నిజంగా సంబంధం ఉందా? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!