-
హైకోర్టు అడ్వకేట్ పెద్దబచ్చగారి రామ్ రెడ్డి సేవా స్పూర్తికి ఘన సన్మానం
భిక్కనూరు, జూలై 27 (నవజ్యోతి ప్రతినిధి):
భిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లి గ్రామంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మితమవుతున్న శ్రీరామ మందిర నిర్మాణానికి భిక్కనూరు వాస్తవ్యులు, హైకోర్టు అడ్వకేట్ పెద్దబచ్చగారి రామ్ రెడ్డి తన సేవాభావాన్ని చాటుతూ రూ.2 లక్షల విరాళాన్ని అందజేశారు. ఆలయ నిర్మాణానికి ఆయన అందించిన ఈ ఉదార సహకారంపై ఆలయ కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ, ఆయన దాతృత్వాన్ని కొనియాడారు.
ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ధార్మిక కార్యక్రమాలకు సమాజంలోని దాతలు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం శ్రీరాముని ఆశీస్సులతో రామ్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, సుఖశాంతులతో చిరకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

