కీసర, ఆగస్టు 2, (నవజ్యోతి ప్రతినిధి) :
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర మండల పరిధిలోని రాంపల్లి చౌరస్తా సమీపంలోని మహీంద్ర షోరూమ్ వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.చిర్యాల గ్రామం, ఇందిరమ్మ కాలనీకి చెందిన మంద నర్సింహులు (35) సూపర్వైజర్‌గా పనిచేస్తున్నారు. విధులకు వెళ్తుండగా బండ్లగూడ నుంచి నాగారం వైపు వెళ్తున్న AP31 TD 7668 నంబర్ గల లారీ అతివేగంగా వచ్చి ఆయన ప్రయాణిస్తున్న TS10 EW 5739 నంబర్ గల బైక్‌ను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో నర్సింహులు డివైడర్‌పై పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలై సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

