📄 ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
Homeమెదక్కాట్రియాల్‌ గ్రామం లో పౌర హక్కులపై అవగాహన కార్యక్రమం.

కాట్రియాల్‌ గ్రామం లో పౌర హక్కులపై అవగాహన కార్యక్రమం.

పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ

రాజ్యాంగ విలువలు, పౌరుల బాధ్యతలపై అధికారుల అవగాహన

రామాయంపేట, జూలై 31 (నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్) : 

మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల్ గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో సివిల్ రైట్స్‌ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, పౌరుల విధులు, సామాజిక సమానత్వం,చట్టాల పట్ల అవగాహన కలిగి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులు సూచించారు.కార్యక్రమంలో రామాయంపేట ఎస్‌ఐ బాలరాజు మాట్లాడుతూ ప్రతి పౌరుడు చట్టాలను గౌరవిస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ గోపి పౌర హక్కుల పరిరక్షణతో పాటు రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని వివరించారు. గ్రామ కార్యదర్శి ధనలక్ష్మి, సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్ మాట్లాడుతూ ప్రజలు తమ హక్కులతో పాటు విధులను కూడా సమర్థంగా నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎమ్.బాబు, వార్డు సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్ గొల్ల శ్రీశైలం, కమ్మరి శ్యామల, ద్యాగాల రాజెల్లు,ఆశ వర్కర్లు ,గ్రామప్రజలు,యువత,స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!