సైబర్ నేరాలకు అప్రమత్తతే ప్రధాన ఆయుధం : తూప్రాన్ సీఐ వెంకటరాజా గౌడ్
తూప్రాన్, 29 జులై ( నవజ్యోతి ప్రతినిధి నవీన్ ) : ప్రస్తుత కాలంలో సాంకేతికతను వినియోగిస్తూ సైబర్ నెరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్న పరిస్థితుల్లో, మెదక్ జిల్లా తూప్రాన్ సర్కిల్ ప్రజలకు అప్రమత్తతే ప్రధాన రక్షణ అని తూప్రాన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట రాజా గౌడ్ సూచించారు, ఇటీవల కాలంలో యూట్యూబ్ ప్రకటనలు, ఇన్వెస్ట్మెంట్ ప్రాడ్లు, స్టాక్ మార్కెట్ మోసాలు, యూపీఐ మోసాలు, లూనియా ప్రాడ్ల పేరుతొ నకిలీ లాభాలను చూపించి అమాయక ప్రజల కష్టార్జిత సొమ్మును దోచుకుంటున్నారని తెలిపారు, వాట్సప్, టెలిగ్రామ్, యూట్యూబ్ , షేర్ మార్కెట్ ల పేరుతొ సోషల్ మీడియా ద్వారా పంపే ఏపీకి ఫైళ్లు డౌన్లోడ్ చేసుకుంటే, వాటి ద్వారా మొబైల్ కంట్రోల్ నేరగల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు, ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు వినియోగిస్తున్న కొత్త కొత్త పద్ధతులు యూట్యూబ్ ప్రకటనలు, షేర్ ఇన్వెస్ట్మెంట్, యూపీఐ, నకిలీ వెబ్సైట్లు, ఆన్లైన్ షాపింగ్ నకిలీ ఆఫర్లు వంటి వాటిగా గుర్తించబడ్డాయి, ముఖ్యంగా యువత ఈ మోసాలకు ఎక్కువగా గురవుతున్నారని సైబర్ నేరగాళ్ల మాయమాటలకు నమ్మి కష్టపడి సంపాదించిన డబ్బులు కోల్పోకుండా తగిన జాగ్రత్తగా ఉండాలని వారు సూచించారు,
అలాగే సోషల్ మీడియాలో వస్తున్న పార్ట్ టైం జాబ్, యూట్యూబ్ ప్రకటన, షేర్ మార్కెట్ ల ఆఫర్లను చూసి స్పందించకూడదని హెచ్చరించారు, ఒకవేళ మోసపోయినట్లు గుర్తిస్తే వెంటనే గోల్డ్ ఇన్ అవర్ లోనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930 కి లేదా వెబ్సైట్లో ఫిర్యాదు చేయడం ప్రతి బాధితుడి మొదటి కర్తవ్యం అని తూప్రాన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరాజా గౌడ్ తూప్రాన్ సర్కిల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

