📄 ePaper
Friday, July 31, 2026
📄 ePaper
Homeమెదక్చదువుకున్న వారే అధికంగా సైబర్ నేరలకు గురవుతున్నారు : తూప్రాన్ సీఐ వెంకట రాజా గౌడ్ 

చదువుకున్న వారే అధికంగా సైబర్ నేరలకు గురవుతున్నారు : తూప్రాన్ సీఐ వెంకట రాజా గౌడ్ 

సైబర్ నేరాలకు మోసపోయి పరువు కోసం బయటకు రాని బాధితులు ఎందరో…

అధిక డబ్బులకు ఆశపడి ఉన్న డబ్బులు పోగొట్టుకున్నాడు….

తూప్రాన్, 29 జులై ( నవజ్యోతి ప్రతినిధి నవీన్) : యూట్యూబ్లో స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో వచ్చిన యాడ్ ను నమ్మి 72.69.973 పోగొట్టుకున్నాడని తూప్రాన్ సీఐ వెంకట రాజ గౌడ్ అన్నారు, తూప్రాన్ సీఐ తెలిపిన వివరాల ప్రకారం-: మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణానికి చెందిన ఓ నిరుద్యోగి గతంలో హైదరాబాద్ లో నివాసo ముండి అక్కడ ఉన్న ఇంటిని అమ్మేసి సొంత ఊరు తూప్రాన్ కు తిరిగి వచ్చి ఉంటున్నాడు. ఇంట్లో కాలిగా ఉంటూ యూట్యూబ్ లో స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు సంబంధించిన ప్రకటన చూసి ‘ ఆకర్షితుడై N114’ ఎలైట్ చాట్ హబ్ ” అనే వాట్సప్ గ్రూపులో చేరాడు. ఆ గ్రూపులో ఉన్న వ్యక్తులు తమను స్టాక్ మార్కెట్ నిపులుగా పరిచయం చేసుకొని. నకిలీ ట్రేడింగ్ యాప్ ను అసలైన ట్రేడింగ్ యాప్ గా నమ్మించి డౌన్లోడ్ చేయించారు. అనంతరం యాప్ లో వచ్చిన నకిలీ లాభాలను నమ్మిన బాధితుడు పలు దపాలుగా నకిలీ యాప్ నిందితులు సూచించిన విధంగా బ్యాంకు అకౌంట్లలో రూ. 72.69.973.లక్షలు పెట్టుబడులు పెట్టడు. అనంతరం నగదును విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా ఇంకా నగదు చెల్లించాలని డిమాండ్ చేశారు. తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు ఎన్వియంఆర్పి పోర్టల్ లో పిర్యాదు చేయగా. మంగళవారం తూప్రాన్ లో కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే 9 లక్షల రూపాయలు ఉన్న అకౌంట్ ను ఫ్రిజ్ చేయడం జరిగిందని సీఐ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!