📄 ePaper
Tuesday, September 29, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్గ్రామాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: షబ్బీర్ అలీ!

గ్రామాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: షబ్బీర్ అలీ!

 

  • పాల్వంచ మండల సర్పంచులతో సమావేశం.. సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా నాగరాజు ఎంపిక..

 

కామారెడ్డి  జూలై 29 (నవజ్యోతి ప్రతినిధి):

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని బుధవారం హైదరాబాద్‌లో పాల్వంచ మండల కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాల్వంచ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా బండ రామేశ్వర్పల్లి గ్రామ సర్పంచ్ నాగరాజును ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు ప్రకటించారు.

అనంతరం సర్పంచులు తమ గ్రామాల్లో నెలకొన్న వివిధ సమస్యలను షబ్బీర్ అలీ దృష్టికి తీసుకెళ్లగా, సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో వాడి సర్పంచ్ నర్సారెడ్డి, పాల్వంచ సర్పంచ్ శేఖర్, సింగారయిపల్లి సర్పంచ్ లత అంజయ్య, ఇస్సాయిపేట సర్పంచ్ లలిత నర్సింలు, ఆరెపల్లి సర్పంచ్ జ్యోతి భూమయ్య, మంథని దేవునిపల్లి సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, భవానీపేట తాండ సర్పంచ్ తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!