📄 ePaper
Wednesday, August 12, 2026
📄 ePaper
HomeతెలంగాణKamareddyనీట్ పేపర్ లీకేజీకి నిరసనగా భిక్కనూరులో విద్యాసంస్థల బంద్!

నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా భిక్కనూరులో విద్యాసంస్థల బంద్!

యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో ప్రశాంతంగా కొనసాగిన ఆందోళన

భిక్కనూరు, జూలై 24 (నవజ్యోతి ప్రతినిధి):

నీట్ పేపర్ లీకేజీ ఘటనకు నిరసనగా విద్యార్థి సంఘాల పిలుపుమేరకు యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో శుక్రవారం భిక్కనూరులో ప్రభుత్వ జూనియర్ కళాశాల బంద్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ చేపట్టిన ఈ బంద్‌కు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కూడా స్వచ్ఛందంగా సహకరించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బంద్ ప్రశాంతంగా సాగింది.

ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్, నాయకులు తిరుపతి, చిరంజీవితో పాటు యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!